హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఆ మ్యాచ్‌లో కివీస్ 18 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని టీమిండియా ఛేదించింది. చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన తరుణంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. (ఇక్కడ చదవండి: ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్ ముగింపు)
అయితే ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో టీమిండియా పోరాడి విజయం సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆనందంలో ఎగిరి గంతులేశాడు. ఒక చిన్న పిల్లోడు మాదిరిగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. మ్యాచ్‌ను రోహిత్ శర్మ గెలిపించిన తర్వాత స్టేడియంలోకి దూసుకొచ్చిన కోహ్లి అచ్చం చిన్న పిల్లోడి మాదిరి జంప్ చేసుకుంటూ వెళ్లి రోహిత్‌ను ఆలింగనం చేసుకున్నాడు. మంచి జోష్‌లో కనిపించిన కోహ్లి.. రోహిత్‌ను గట్టిగా వాటేసుకుని అభినందనల్లో ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.