జస్టిస్ ఫర్ దిశ పేరుతో న్యాయవాదుల దీక్ష

జస్టిస్ ఫర్ దిశ పేరుతో నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు గేట్ నెంబర్ టు వద్ద న్యాయవాదులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం లు మాట్లాడుతూ దిశ కేసు విషయంలో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు మూడు నెలల్లోనే శిక్షపడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. నిందితుల తరపున ఏ న్యాయవాది వాదనలు వినిపించరాదని , వారికి ఎవరు కూడా న్యాయ సహాయం అందించరాదని న్యాయ వాదులకు పిలుపునిచ్చారు. దిశ కేసు విషయంలో నిందితులకు సరైన శిక్ష పడేందుకు సీనియర్ న్యాయవాదుల మరియు అధికారుల సలహాలను తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు భద్రత కలిగించేందుకు కు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత మెరుగు పరచాలని, అంతేకాకుండా ఎవరైనా ఆపద సమయంలో 100 డయల్ చేసిన వెంటనే నేరస్థలం తో సంబంధం లేకుండా జీరోఎఫ్ఐర్ నమోదు చేసే విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరే మహిళకి ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు జాగ్రత్త వహించాలని, అందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం క్యాండీల్స్ వెలిగించి నిరసన తెలియజేశారు. నిందితులకు వ్యతిరేకంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులతో పాటు న్యాయవాదులు సంధ్యారాణి ,సుజాత, అనీఫ్ ఖాన్, నోటరీ నాగేందర్ ,అమర్ గుప్తా తదితరులు పాల్గన్నారు.